Tuesday, 03.19.2024, 9:29 AM
My site

గాయత్రీ దేవి రెండో రోజు


గాయత్రీ దేవి రెండో రోజు

"ముక్తా విద్రుమ హేమనీల
ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:
యుక్తామిందు నిబద్ధరత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాంకుశమ్
కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద
యుగళం హసైర్వాహంతీం భజే"


సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.




నైవేద్యం - అల్లం గారెలు
కావలసిన పదార్ధాలు
మినప్పప్పు - అరకిలో
పచ్చిమిరపకాయలు - ఆరు
ఉల్లిపాయలు - రెండు
అల్లం - 100 గ్రాములు
జీలకర్ర - రెండు టీ స్పూన్లు
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా


తయారు చేయు విధానం

 నానబెట్టిన మినప్పప్పును పల్చగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, ఉప్పు వేసి కలుపుకోవాలి. మూకుట్లో నూనె కాగనిచ్చి గారెలు వేసుకోవాలి.

Login form
Search
Our poll
Rate my site
Total of answers: 38
Site friends
  • Create a free website
  • Online Desktop
  • Free Online Games
  • Video Tutorials
  • All HTML Tags
  • Browser Kits
  • Statistics

    Total online: 1
    Guests: 1
    Users: 0