Tuesday, 07.07.2020, 12:23 PM
My site

సృష్టి అవిర్బ్బవం


 

సృష్టి అవిర్బ్బవం

ఈలోగ విష్ణువు కూడా శివుని వద్దకు వచ్చి నమస్కరిస్తాడు.ఆయా కార్యాలు నిర్వహించేందుకు తమకు తామే నియమించుకున్నఈ ముగ్గురు ఉండే౦దుకు అనువైన స్థావరాల కోసం ఆలోచిస్తూ ఉంటారు.అప్పుడా విష్ణువు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకాన్ని, తానూ లక్ష్మిదేవి ఉండే౦దుకు వైకుంఠమును, శివపార్వతులు నివసించేందుకు కైలాసాన్ని నివాస యోగ్యంగా నిర్ణయిస్తాడు. ఇందుకు బ్రహ్మ, శివుడు కూడా అంగీకరించి అ విధంగానే ఆయా లోకాలకు పయనమై అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంటారు.  శివ పంచాక్షరీ మంత్రాన్నిజపిస్తూ వైకుంఠంలో విష్ణువు ఉంటే ,’ఓ౦ నమో నారాయణాయ’అనే మంత్రాన్ని జపిస్తూ శివుడు కైలాసంలో ఉంటాడు.ఇక బ్రహ్మదేవుడు ఓ౦కార రూపుడైన పరమేశ్వరుని ధ్యానిస్తూ సత్యలోకంలో కాపురం ఉంటూ ఇక్కడి నుంచి తన సృష్టికార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. సృష్టి నిర్వహణలో భాగంగా తనకు సహాయంగా ఉ౦డే౦దుకు బ్రహ్మదేవుడు కొంతమంది ఉపబ్రహ్మలను సృజిస్తాడు . ఈ ఉపబ్రహ్మలలో ముఖ్యుడైన దక్షప్రజాపతికి అరవైనాలుగుమంది సంతానం కలుగుతుంది.ఈ సంతానంలో పదిమంది కుమార్తెలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తాడు . అలా కశ్యపుని వివాహం చేసుకున్న వారిలో అదితి, దితి, వినత, స్వస, కద్రు, ముని, అరిష్ట ,మాతంగి, తామ్ర, ఇల, అనేవారు ఉన్నారు . కశ్యపుడు , అదితులకు, ఇంద్రాదిదేవతలు జన్మిస్తే, దితికి రాక్షసులు , పుడతారు.కద్రువకు నాగులు , మునికి గంధర్వులు , అరిష్ట అచ్చరలు, మాతంగికి ఐరావతాదులు, తామ్ర, ఇలలకు పక్షులు ,వృక్షాలు తదితరాలు జన్మిస్తాయి .అదితి కడుపున పుట్టినవారంతా మంచి గుణాలతో త్రిమూర్తులను స్మరిస్తూ ఉంటారు . అందుకని స్వర్గపట్టణాన్ని వీరు ఉ౦డెందుకు నివాసయోగ్యంగా నిర్ణయిస్తారు. అంతేకదు! ఈ దేవతల్లో ఇంద్రుడిని స్వర్గాధిపతిగా నియమిస్తారు .అలాగే యజ్ఞయాగాదుల్లో హవిర్భాగాన్నితీసుకునే అధికారాన్నికూడా వీరికి కల్పిస్తారు . కానీ దితికి పుట్టిన వారంతా తామగుణంతో లోకాన్నికల్లోలపరిచే గుణం కలిగి ఉంటారు . అలాగే ఇతరుల బాగు చూసి అసూయతో వేగిపోతు అందర్ని తల్లడిల్ల చేస్తూ౦టారు .దా౦తో వీరికి అరణ్యాలు, కొ౦డగుహలు నివాసయోగ్యంగా ఏర్పాటు చేస్తారు . ఈ చర్యతో ఒక్కసారి ఉలిక్కిపడతాడు బ్రహ్మ. అప్పటివరకూ తనను ఆవరించి ఉన్న మాయపొర, అహంకారం, అజ్ఞానమూ ఈశ్వరుని చర్యతో మటుమాయమైపోతాయి. ఇప్పటికి తనేమిటో తన ఆవిర్భావ పరమార్థం ఏమిటో, తాను ఎక్కడినుంచి జన్మించాడో, తన జన్మకు కారకుడు ఎవరో ... అన్న విషయాలన్నీ అవగతమవుతాయి. అంతే! ఇంక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా పరమేశ్వరుని పాదాలపై పడి ‘’క్షమించమ’’ణి వేడుకుంటాడు.బ్రహ్మదేవుని ప్రార్థనతో శాంతించిన శివుడు తన రౌద్రాకారాన్ని ఉపసంహరించుకుని స్సస్వరూపాన్ని ధరించి శాంతస్వరంతో ఇలా అంటాడు...   ‘’ఓయీ బ్రహ్మ! సర్వజ్ఞాన సంపన్నుడు, వేదనిలయుడు, ముఖ్యంగా నీ జన్మకు కారకుడూ అయిన విష్ణువు వద్దనుంచి వేదాలసారాన్ని గ్రహించి సృష్టి కార్యాన్ని మొదలుపెట్టు’’ అని చెబుతాడు ఇంకా ---

‘’ఆ సృష్టిని ఒక క్రమమైన విధానంతో పెంచి పోషించే బాధ్యతను విష్ణుమూర్తి నిర్వహిస్తాడు. ఆ సృష్టిని కాలానుగుణ౦గా సమయం తీరిపోగానే రుద్రునిగా లయం చేసే ప్రక్రియను నేను స్వీకరించి నిర్వహిస్తాను. ఇది ఇలా నిరంతరం ఆగకుండా సాగాల్సిన ప్రక్రియ. ఇకనుంచి ఆయా కార్యాలను నిర్వహించే మనం బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా కొనియాడబడతాము. సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహించే మన ముగ్గురం త్రిమూర్తులుగా విఖ్యాతి చెందుతాం. అయితే త్రిమూర్తులుగా వేర్వేరు రూపాలతో మనం కనిపిస్తున్నప్పటికీ నిజానికి మన ముగ్గురమూ ఒక్కటే, మనలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే బేధాలు ఉండవు. నన్ను శివుడని, మహేశ్వరుడని, శంకరుడని వేర్వేరు నామాలతో పిలుస్తూ కొలుస్తారు. నా ఈ జ్యోతిర్లింగాన్ని శ్రద్ధతో పూజించిన వారికి సర్వసుఖాలూ అబ్బుతాయి. ఏ విధమైన శంకాటంకాలు లేకుండా జీవితం సజావుగా సాగిపోతుంది. అత్యంలో వారు నా సన్నిధికి చేరుకుంటారు’’ అని బ్రహ్మ విష్ణువులకు వివరించి ఆ మహాజ్యోతిర్లింగంలో కలిసి అదృశ్యమావుతాడు మహేశ్వరుడు. ఈశ్వరుడు చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకుంటారు బ్రహ్మవిష్ణువులు. శివుడు అంతర్థానం కాగానే ఆ జ్యోతిర్లింగానికి అనేక విధాలుగా పూజలు నిర్వహిస్తారు వీరు. మహాన్యాసపూర్వక రుద్రాధ్యాయాలతో మహాలింగాన్ని అభిషేకించి మహోన్నతంగా అర్చనలు, హారతులు సమర్పిస్తారు.
చేపట్టే సృష్టికార్యాన్ని సజావుగా నడిపించే శక్తిని చాలినంతగా ఇమ్మని పరిపరివిధాలుగా ప్రార్థిస్తారు. ఆ అర్చనలకూ, అభిషేకాలకూ, అర్థింపులకూ శివుడు పొంగిపోతాడు. అంతేకాదు! వెంటనే వీరి ముందు ప్రత్యక్షమై ‘’మీరు నిరాటంకంగా మీమీ కార్యాలని పూర్తిచేయగలరు. నిస్సంకోచంగా కార్యసాధకులు కండి’’ అని ఆశీర్వదించి అంతర్హితుడవుతాడు.
శివాజ్ఞతో బ్రహ్మవిష్ణువులిద్దరూ సృష్టి ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు ఆయత్తమవుతారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా జలం తప్ప మరేమీ కనిపించడం లేదు కదా, సృష్టిని ఎలా, ఎక్కడినుంచి మొదలుపెట్టాలంటూ వీరిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుంటారు. ఇంతకంటే ముందు బ్రహ్మ విష్ణువు ద్వారా వేదాలనన్నింటినీ ఆకళింపు చేసుకుని సర్వజ్ఞాన సంపన్నుడవుతాడు. అనంతరం బ్రహ్మదేవుడు సృష్టికార్యానికి పూనుకుంటాడు.

Login form
Search
Our poll
Rate my site
Total of answers: 38
Site friends
 • Create a free website
 • Online Desktop
 • Free Online Games
 • Video Tutorials
 • All HTML Tags
 • Browser Kits
 • Statistics

  Total online: 1
  Guests: 1
  Users: 0