ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమ౦దలి
మొదటి అధ్యాయము - మొదటి రోజు పారాయణము సమాప్తం
శ్లో ఓమిత్యే కక్షార౦ బ్రహ్మవ్యాహరితి త్రయశిఖ:
తాసై తరాత్మ నే మేతదశినముర్తాయే నమ:
సోమవార వ్రత మహిమ
జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన విధి కార్యక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కానీ, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావదానుడవై ఆలకించుము. కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి
కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పటన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తేసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంట ప్రాప్తియు నొందును. దీనిని ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెదను శ్రద్దగా వినుము.
పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి ' తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశియుడగు మిత్ర శర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అబ్యాసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్య వాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడను యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొను చు౦ డేడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్టురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను
దుషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు , బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చు చున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, "చీ పోమ్మనక , విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారి నిష్టురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెను ' కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.