Monday, 01.20.2025, 5:54 AM
My site

KARTHIKA MASAM 19


KARTHIKA MASAM 19

ధీ ప ప్రజ్వలన ముచే ఎలుక పూర్వ జన్మ స్మృతితో  నరరూపమందుట
అంత ట జనక మహారాజుతో వశిష్ట మహాముని - జనకా ! కార్తీక మహత్యము గురించి యెంత  వివరించిననూ పూర్తి కానేరదు. కాని, మరి యొక  యితిహసము   తెలియ చెప్పెదను సావదానుడ వై  ఆలకింపు - మని ఇట్లు చెప్పెను.
ఈ మాసమున హరి నామ సంకీర్తన లు వినుట, చేయుట, శివ కేశవుల వద్ద ధీ పారాధ ననుచేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతా దర్శనము  - చేయలెనివారు కాల సూత్రా మనెడి నరకముబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మన సారా శ్రీహరి ని పూజించిన వారికీ అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ ని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీ ప నైవేద్యము యిచ్చిన యెడల, విశే ష ఫలము పొందగలరు. ఈవిధ ముగా నెలరోజులు విడువక చేసిన యెడల, అట్టి వారు దేవదుందుభులు మ్రోగు చుండగా విమాన మెక్కి వైకుంఠ మునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ  త్ర యోదశి, చెతుర్ద శి , పూర్ణ మరోజులందైనా నిష్ట తో పూజలు చేసి  ఆవునే తితో దిపమునుంచవలెను.
ఈ మహా కార్తీక కములో ఆవుపాలు పితికి నంత సేపు మాత్ర ముదీ పముంచిన యెడల  మరు జన్మలో బ్రాహణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన ధీ పము మెగ ద్రోసి వృద్ద చేసిన యె డల, లేక , ఆరి పోయిను ధీ పమున వెలిగించినాను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. విను - మని వశిస్టులవారు యిట్లు చెప్పుచునారు.
సరస్వతి నదీ తీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్టుడైన  దయార్ద్ర  హృద యుడగు ఒక యోగి పుంగ వుడు అ దేవాలయము వద్ద కు వచ్చి కార్తీక మాసయంతయు   అచటనే గడిపి పురాణ పటనము జే యు తలంపురాగా ఆ పాడుబడి యున్న దేవాలయమును శ్రుభ ముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో  వత్తులు జేసి, పండ్రెండు దీ పములుంచి, స్వామిని పుజించుచు, నిష్టతో పురాణము చదువుచుండెను. ఈ విధ ముగా కార్తీక మాసము ప్రారంభ మునుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవెశించి, నలుమూలలు వెదకి, తిన డానికి ఏమీ దొరకనందున అక్కడ అరి పోయియున్న వత్తిని తిని వలసిన దే నని అనుకోని నోట కరుచుకొని ప్రక్కనున్న దీ పమువద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరి పోయిన వత్తి కూడా వెలిగి వెలుతురూ వచ్చెను. అది కార్తీక మాసమగుటవలనను, శివాలయములో ఆరి పోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగి నందున వెంటనే దానిరూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో వున్న యోగి పుంగ వుడు తన కన్నులను తెర చిచూడ గా, ప్రక్క నొక మానవుడు నిలబడి యుండుటను గమనించి "ఓయీ!నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించ గా" ఆర్యా ! నేను మూషిక మును, రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రేవేశించి యిక్కడ కూడా ఏమి దొరక నందున నెయ్యి వాసనలతో  నుండి అరి పోయిన వత్తి ని తిన వలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీ పంచెంత నిలబడి వుండగ, నా అదృష్ట  ముకోలదీ ఆ వత్తి వేలుగుటచే నాపాపములు పోయి నుందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కాని , ఓ మహానుభావా! నేను యెందుకి  మూషిక జన్మ మెత్త వలసివచ్చేనో - దానికి గల కారణమేమిటో విశ దీ కరింపు " మని కో రెను.

అంత యోగీ శ్వరుడు ఆశ్చర్య పడి తన ది వ్యదృష్టి చే సర్వము తెలుసుకొని " ఓయీ! క్రింద టి జన్మలో నీవు  బ్రాహణుడువు. నిన్ను బాహ్లి కుడ ని పిలిచెడి వారు. నీవు  జైన మత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవ సాయంచే స్తూ, ధ నాశాపరుడ వైదేవ పూజలు, నిత్యకర్మములు మరచి, నీ చుల సహవాసము వలన నిషిద్దా న్నము తినుచు, మంచివార లము, యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్ద చింత గలవాడ వై ఆడ పిల్ల లను అమ్ము వృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన  ధనాన్ని కూడ బెట్టుచు, సమస్త తిను బండార ములను కడు చౌక గా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభ వించక యిత రులకు యివ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారి వై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపమును భ వించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరి పోయిన దీ పాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించింది. కాన, నీవు  ని గ్రామమునకు పోయి నీ పెరటి యుందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దాన ధర్మాలు  చేసి భగవంతుని ప్రార్దంచుకొని మొక్షేము పొందు " మని అతనికి నీ తులు చెప్పి పంపించెను.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
పంచ దశాద్యయము - పదిహేనవ రోజు పారాయణము సమాప్తము.
మ|| సదయా ఇంద్రియ ధేనువుల్ విషయ ఘాస గ్రాసలో లమ్ము లై
బ్రదు కుం బిడులు బట్టి నిన్మరిచి పోవంబోవ ప్రాయం పుప్రో
ద్ద దేడిందన్ పయిగమ్ము చికటిలలో నల్లాడవే సుంత నీ
మృదవౌ మోవిని పిల్ల గ్రోవి నీడలేని వేణు గోపాలకా||

Login form
Search
Our poll
Rate my site
Total of answers: 38
Site friends
  • Create a free website
  • Online Desktop
  • Free Online Games
  • Video Tutorials
  • All HTML Tags
  • Browser Kits
  • Statistics

    Total online: 4
    Guests: 4
    Users: 0