Tuesday, 07.07.2020, 12:49 PM
My site

KARTHIKA MASAM 8


KARTHIKA MASAM 8

వనబోజన మహిమ
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూ
జాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము   తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకు౦టమునకు
వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠి౦చిన  వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క
దమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచిత౦గా  పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి,  ఉసిరి చెట్టు నీడను  భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరిం వలయును.
వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం  చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను- యని  వశిష్టుల వారు  చెప్పిరి. అది విని జనక రాజు ' ముని
వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల  కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు విధంబుగా చెప్పనారంభి౦చిరి.


కిరాత
మూ షికములు మోక్షము నొందుట
రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కల
డు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారములు కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి  అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రీ ' ఓరి నీ చుడా! కార్తిక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన, నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవుగాక' అని కుమారుని శాపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివ శర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి ' తండ్రీ  క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధ కరములో బడి దైవమునూ, దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు  పశ్చాత్తాపము కలిగినది. నక శాపవిమోచన మోప్పుడే  విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ మెమో వివరింపు'మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ ' బిడ్డా ! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పది యుండగా నివెప్పుడు కార్తిక మహత్యమును వినగాలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దు దువు ' అని కుమారుని వూరడించెను. వెంటనే శివ శర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.

ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న య పెద్ద వట వృక్షము నీడను కొంత సేపు విశ్రమించి, లోకబి రామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా  కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వుత వృక్షం క్రినకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని' విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు'న నెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో న మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గణ, వివరింపుడు' అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఐ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరి౦చి కార్తీక పురాణమునకు పతిన్చుచున్నాము. నీవును యిచట కూర్చుంది సావడనుడవై యలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణ న౦తరము  వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది ' ముని వార్య ! ధన్యోస్మి  తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించావలెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత  వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.

Login form
Search
Our poll
Rate my site
Total of answers: 38
Site friends
 • Create a free website
 • Online Desktop
 • Free Online Games
 • Video Tutorials
 • All HTML Tags
 • Browser Kits
 • Statistics

  Total online: 1
  Guests: 1
  Users: 0