Monday, 01.20.2025, 5:59 AM
My site

KARTHIKAMASAM 13


KARTHIKAMASAM 13

విష్ణు పార్షద, యమ దూతల వివాదము

'ఓ యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధన౦జయాది వాయువులు,రాత్రి౦బవళ్లు సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును, గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు, పర స్త్రీ లను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను- కుల వృతిని తిట్టి హింసి౦చు వారున్నూ, జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్ర ష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృత ఘ్నులును, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును- అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానము చేయువారును, అనాధ ప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువరును, తటాకములు త్రవ్వి౦చువరును, శివ కేశవులను పూజి౦చు వారును సదా హరి నమ స్మరణ చేయువారును మరణ కాలమందు ' నారాయణా'యని శ్రీ హరిణి గాని, ' శివ ' అని శివుని గాని స్మరించు వారును, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున" నారాయణా"అని పలికిరి.

అజా మీ ళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది " ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్ర ష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో " నారాయణా" యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకున్తమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడు! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంటమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద, కలిగించేనో, అటులనే శ్రీ హరి స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదారు. ఇది ముమ్మాటికినీ నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

నవమద్యయము- తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.

Login form
Search
Our poll
Rate my site
Total of answers: 38
Site friends
  • Create a free website
  • Online Desktop
  • Free Online Games
  • Video Tutorials
  • All HTML Tags
  • Browser Kits
  • Statistics

    Total online: 5
    Guests: 5
    Users: 0